భారతదేశం, నవంబర్ 1 -- సత్యసాయి జిల్లాలోని పెద్దన్నవారి పల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో మెరుగ్గా పింఛన్లు పంపిణీ చేస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క పెన్షన్ ఇచ్చేందుకు 2 లక్షల మందికిపైగా వాలంటీర్లను పెట్టారని విమర్శించారు. అయితే దానికంటే మెరుగ్గా ప్రస్తుతం తమ ప్రభుత్వం మూడు గంటల్లోనే పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు.

'మా ప్రభుత్వంలో మెరుగ్గా పెన్షన్స్ పంపిణీ చేస్తున్నాం. ప్రజల సంక్షేమం కోసం పెద్దపీట వేయడంతోపాటుగా సుపరిపాలన ద్వారా ఏపీ పునర్నిర్మాణం చేస్తున్నాం. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేటుతో కూటమిని గెలిపించి అధికారం అప్పగించారు. అందుకోసమే ఎల్లప్పుడూ ప్రజల గురించి మా ప్రభుత్వం ఆలోచన చేస్త...