భారతదేశం, జూన్ 28 -- తేజ, తన్మయి ఖుషి ప్రధాన పాత్రలు పోషించిన '23' (ఇరవై మూడు) సినిమా మే 16వ తేదీన థియేటర్లలో విడుదలైంది. మూడు యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. మల్లేశం, 7ఏఎం మెట్రో లాంటి హార్ట్ టచ్చింగ్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు రాజ్ ఆర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. థియేట్రికల్ రిలీజ్‍లో ఈ చిత్రం మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. ఈ 23 సినిమా తాజాగా మూడు ఓటీటీల్లోకి అడుగుపెట్టింది.

23 చిత్రం ఇదే వారంలో ఏకంగా మూడు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి ఎంట్రీ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా, ఈటీవీ విన్ ఓటీటీల్లో ఈ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా మూడు ఓటీటీల్లో ఈ చిత్రం అడుగుపెట్టింది.

23 సినిమా మూడు యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కింది. చుండూరు ఊచకోత (1991), చిలకలూరి పేట బస్సు దగ్ధం (1993), జూబ్లిహిల్స్ కారు పే...