భారతదేశం, మే 10 -- ఓ తమిళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ఒకే వారంలో మూడు ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అదే 'టెన్ హవర్స్' సినిమా. ఏప్రిల్ 18వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. సిబి సత్యరాజ్ హీరోగా నచించిన ఈ మూవీకి ఇళయరాజా కలియపెరుమాల్ దర్శకత్వం వహించారు. థియేట్రికల్ రన్‍లో ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ టెన్ హవర్స్ సినిమా ఇప్పుడు ఏకంగా మూడు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్‍కు వచ్చింది.

టెన్ హవర్స్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్‍నెక్స్ట్, టెంట్‍కొట్టా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఇదే వారంలో మూడు ప్లాట్‍ఫామ్‍ల్లోకి అడుగుపెట్టింది. ఆ ఓటీటీల్లో ఈ చిత్రాన్ని చూసేయవచ్చు.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళంతో పాటు కన్నడ, మలయాళంలోనూ టెన్ హవర్స్ అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. సన్‍నెక్స్ట...