భారతదేశం, జనవరి 29 -- హైదరాబాద్/సిడ్నీ: "డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు.. కానీ ప్రేమను సంపాదించలేము" అని నిరూపించింది ఒక భారతీయ జంట. తన పెంపుడు కుక్కను తనతో పాటు విదేశాలకు తీసుకెళ్లడం కోసం ఏకంగా రూ.15 లక్షలు ఖర్చు చేసి, అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ భావోద్వేగ ప్రయాణానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హైదరాబాద్‌కు చెందిన ఒక దంపతులు ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాకు మారాలని నిర్ణయించుకున్నారు. అయితే, తమతో పాటు తమ ప్రాణప్రదమైన పెంపుడు కుక్క 'స్కై' (Sky)ని కూడా తీసుకెళ్లాలనుకున్నారు. కానీ, ఆస్ట్రేలియాలోని కఠినమైన యానిమల్ ఇంపోర్ట్ నిబంధనలు వారికి పెద్ద అడ్డంకిగా మారాయి.

ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం.. భారత్ నుంచి పెంపుడు జంతువులను నేరుగా ఆ దేశానికి తీసుకెళ్లడం సాధ్యం కాదు. ఎందుకంటే, ఆస్ట్రేలియాకు భారత్ 'రేబిస్-ఫ్రీ' దేశం కాదు. ...