భారతదేశం, జూలై 23 -- తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల నుంచి ముస్లింలను తొలగిస్తేనే 42% రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తుందని బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలను గట్టిగా ఖండిస్తోంది. బీజేపీ అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం కులాలు ఎన్నో ఏళ్లుగా ఓబీసీ (ఇతర వెనుకబడిన తరగతులు) జాబితాలో ఉండి విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతున్నాయని కాంగ్రెస్ నేతలు గుర్తుచేస్తున్నారు. ఈ వాస్తవాన్ని విస్మరించి తెలంగాణ బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని వారు విమర్శిస్తున్నారు.

ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అస్సాం వంటి రాష్ట్రాల్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ముస్లిం కులాలు, ఉపకులాలు ఓ...