భారతదేశం, ఏప్రిల్ 18 -- ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ప్రజలు, ముఖ్యంగా మహిళలు, వితంతువులు ప్రముఖ పాత్ర పోషించారని, వందలాది ఫిర్యాదుల తర్వాత వక్ఫ్ (సవరణ) చట్టం, 2025 తీసుకువచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పాత వ్యవస్థలో అణచివేతకు గురైన బాధితులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దావూదీ బోహ్రా కమ్యూనిటీ ప్రతినిధి బృందంతో సమావేశమైన సందర్భంగా ప్రధాని మోదీ ఈ విషయం చెప్పారు. 2019లో మళ్లీ ప్రధాని అయ్యాక వక్ఫ్ ఆస్తులకు సంబంధించి వివిధ ముస్లిం వర్గాల నుంచి 1700కు పైగా ఫిర్యాదులు వచ్చాయని, అందుకే ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుందని చెప్పారు.

కొత్త చట్టం వల్ల ఈ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయన్నారు మోదీ. ఇప్పటికే బాధితుల కోసం, ముఖ్యంగా పాత చట్టాల వల్ల ఎక్కువగా నష్టపోయిన వితంతువుల కోసం పోరాడుతున్నామన్నారు. వా...