Telangana,mulugu, జూలై 25 -- ములుగు జిల్లాలో సమ్మక్క - సారక్క సెంట్రల్ ట్రైబల్ వర్శిటీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. 2025-26 విద్యా సంవత్సరానికి గానూ బీఏ ప్రోగ్రామ్ లో అడ్మిషన్ల కోసం అర్హులైన వారి నుంచి ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందులో ఇంగ్లీష్ అనర్స్ తో పాటు సోషల్ సైనెన్స్ కోర్సులు ఉన్నాయి. నాలుగేళ్ల కాలపరిమితితో వీటిని ప్రవేశపెట్టారు.

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభం కాగా.... జూలై 31వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు. ఆగస్టు 9వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన ఉండగా.. ఆగస్టు 11వ తేదీ నుంచి నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. https://ssctu.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. ఏమైనా సందేహాలుంటే admission@ssctu.ac.in మెయిల్ ...