Mulugu,telangana, జూలై 23 -- తెలంగాణవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. మరో రెండు మూడు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణశాఖ హెచ్చరికలను కూడా జారీ చేసింది. అయితే గడిచిన 24 గంటలుగా ములుగు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి.

ములుగు జిల్లాలో గత 24 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అత్యంత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తక్షణ సమాచారం, సహాయం కోసం ములుగు కలెక్టరేట్ లో టోల్ ఫ్రీ నంబర్ (1800 425 7109) అందుబాటులో ఉంచినట్లు జిల్లా మంత్రి సీతక్క ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఏవైనా సందేహాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఈ నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.

విద్యుత్ తీగ...