Hyderabad, మార్చి 28 -- మహిళలకు 30 ఏళ్లు దాటిందంటే ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరమని అర్థం చేసుకోండి. ఎందుకంటే 30 ఏళ్లు దాటిన మహిళల్లో ఎముకలు బలహీనంగా మారడం మొదలవుతాయి. వారి ఎముక ద్రవ్యరాశి త్వరగా తగ్గుతుంది. అలాగే ఆర్థరైటిస్ వంటి వ్యాధుల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. 30 ఏళ్లు దాటిన మహిళలు ప్రత్యేకంగా ఆహారంలో కొన్ని పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఇవి బలమైన ఎముకలను అందిస్తాయి. ఎముక అనారోగ్యాలు రాకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ వంటి వ్యాధులు రాకుండా రక్షణ కల్పిస్తాయి.

మార్కెట్లో దొరికే ఆకుపచ్చని ఆకుకూరలను అధికంగా తినాలి. ముఖ్యంగా మెంతికూర, పాలకూర వంటివి తినాల్సిన అవసరం ఉంది. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలు ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాబట్టి వీటిని కూరగా వండుకొని తిన్నా లేదా సలాడ్లలో వేసుకొని పచ...