భారతదేశం, జనవరి 15 -- మహారాష్ట్రలో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేడి స్టాక్ మార్కెట్ వర్గాలకు కూడా తాకింది. ఈ ఎన్నికల దృష్ట్యా గురువారం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లకు సెలవు ప్రకటించారు. అయితే, ఒక స్థానిక సంస్థల ఎన్నికల కోసం దేశీయ స్టాక్ మార్కెట్లను పూర్తిగా స్తంభింపజేయడంపై జెరోధా (Zerodha) వ్యవస్థాపకుడు, సీఈఓ నితిన్ కామత్ తీవ్రంగా స్పందించారు.

నితిన్ కామత్ సోషల్ మీడియా వేదికగా ఈ నిర్ణయాన్ని తప్పుబట్టారు. "భారత స్టాక్ ఎక్స్ఛేంజీలకు అంతర్జాతీయ మార్కెట్లతో సంబంధాలు ఉంటాయి. అలాంటి కీలక వ్యవస్థలను ఒక స్థానిక మున్సిపల్ ఎన్నికల కోసం మూసివేయడం అనేది సరైన ప్రణాళిక లేకపోవడమే. భవిష్యత్తులో దీనివల్ల కలిగే పరిణామాలపై అవగాహన లోపానికి ఇది నిదర్శనం" అని నితిన్ కామత్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు....