భారతదేశం, జనవరి 8 -- తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తయ్యాయి. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ సన్నాహకాల్లో భాగంగా కమిషన్ జిల్లా, మున్సిపల్ అధికారులతో సమన్వయాన్ని పెంచుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సీనియర్ అధికారులు ఎన్నికల సన్నద్ధతను సమీక్షించడానికి జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో తాజాగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా జనవరి 13న టీ-పోల్ యాప్‌లో అందుబాటులో ఉంటుంది. జనవరి 12వ తేదీలోగా తుది ఓటర్ల జాబితాను ప్రచురించాలని కమిషన్ అధికారులను ఆదేశించింది. అలాగే పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను జనవరి 13న టీ-పోల్ మొబైల్ అప్లికేషన్‌లో అప్‌లోడ్ చేయాలని కూడా సూచించింది. జనవరి 16న పోలింగ్ కేంద్రాల వారీగా ఫోటోలతో కూడిన తుది ఓటర్ల జాబితాలను విడుదల చేయాలని అధి...