Hyderabad, జూలై 17 -- తెలుగు చిత్రసీమలో లెజండరీ హీరోగా పేరు తెచ్చుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలకు ఆయన కేరాఫ్ అడ్రస్. అనేక అంశాల్లో విభిన్న ప్రయోగాలు చేసిన ఘనత సూపర్ స్టార్ కృష్ణకే దక్కింది. టెక్నికల్‌గానే కాకుండా గ్లామర్‌ పరంగా కూడా వినూత్న ప్రయోగాన్ని సూపర్ స్టార్ కృష్ణ 90స్ కాలంలోనే చేశారు.

అదే ముగ్గురు హీరోయిన్లతో జోడీ కట్టడం. ఇటీవల తెలుగు కమర్షియల్ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉండటం సాధారణం అయిపోయింది. కానీ, ముగ్గురు హీరోయిన్లతో డ్యూయెట్ సాంగ్ చేయడం చాలా అరుదు. అలాంటిది సూపర్ స్టార్ కృష్ణ 1994లోనే ముగ్గురు హీరోయిన్లతో రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్‌తో అదరగొట్టారు.

ఆ పాటనే నీతో సాయంత్రం ఎంతో సంతోషం. 1994లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాల్లో అమ్మ దొంగ ఒక్కటి. ఈ సినిమాలో కృష్ణకు జోడీగా సౌందర్య, ఆమని, ఇంద్రజ ముగ్గు...