భారతదేశం, మే 12 -- వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోలీస్ విచారణ ముగిసింది. సీకేపల్లి పోలీస్ స్టేషన్‌లో 3 గంటలకుపైగా పోలీసులు ప్రశ్నించారు. విచారణలో పోలీసులు 102 ప్రశ్నలు అడిగినట్టు తెలిసింది. హెలికాప్టర్‌ విండ్‌ షీల్డ్ పగిలిన ఘటనకు తనకు సంబంధం లేదని తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి స్పష్టం చేశారు.

'హెలికాప్టర్‌ ల్యాండింగ్‌ పర్మిషన్‌ నేను తీసుకోలేదు. హెలిపాడ్‌ వైపు వెళ్లొద్దని కార్యకర్తలను సముదాయించా. పోలీసులు చెప్పడంతోనే కార్యకర్తలను కంట్రోల్‌ చేశా. జగన్‌ పాపిరెడ్డిపల్లి పర్యటనకు.. పోలీసులు సరైన బందోబస్తు ఏర్పాటు చేయలేదు. పోలీసుల భద్రతా వైఫల్యం కప్పిపుచ్చుకునేందుకే.. మాపై కేసులు నమోదు చేశారు' అని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.

'జగన్‌ హెలికాప్టర్‌ విండ్‌షీల్డ్‌ పగిలిన కేసులో.. మరికొంత మందిని అరెస్ట్‌ చేయాల్సి ఉంది. అవసర...