భారతదేశం, మే 4 -- తెలంగాణ ఈఏపీసెట్-2025 పరీక్షలు ప్రశాంతంగా ముగిశా యి. జేఎన్టీయూ హైదరాబాద్ నిర్వహించిన ఈ పరీక్షలకు దాదాపు 93 శాతం పైగా హాజరు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు జరగగా, మే 2, 3, 4 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించారు.

టీజీ ఈఏపీసెట్ అగ్రికల్చర్ పరీక్షకు 92 శాతం, ఫార్మసీ స్ట్రీమ్‌లో 94 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో దాదాపు 94 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. తెలంగాణ ఈఏపీసెట్ రెస్పాన్స్ షీట్, ప్రాథమిక కీ పై నిర్వాహకులు అప్డేట్ ఇచ్చారు.

టీజీ ఈఏపీసెట్ అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్స్ షీట్, మాస్టర్ క్వశ్చన్ పేపర్ ను https://eapcet.tgche.ac.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు మే 04వ ...