భారతదేశం, మే 26 -- ఆంధ్రప్రదేశ్‌ లా సెట్‌ 2025కు దరఖాస్తు గడువు ముగిసింది. రూ.10వేల రుపాయల ఆలస్య రుసుముతో లా సెట్‌ 2025 ఎంట్రన్స్‌కు దరఖాస్తు చేసుకోడానికి ఆదివారంతో గడువు ముగిసింది. ఏప్రిల్ 27వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఏపీ లాసెట్‌ 2025 దరఖాస్తులు స్వీకరించారు.

ఏపీ లాసెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ గడువు ముగిసింది. ఆన్‌లైన్‌ ద్వారా లాసెట్‌ దరఖాస్తులను స్వీకరించారు. జూన్ 5న లాసెట్ పరీక్ష నిర్వహిస్తారు. జూన్ 22వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌ లా సెట్ 2025 నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మూడేళ్లు, ఐదేళ్లతో పాటు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.ఏప్రిల్ 27 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించారు.

ఏపీ లాసెట్ - 2025 కు ఏప్రిల్ 28 నుంచి మే 4...