Andhrapradesh, జూలై 3 -- ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు ముగిశాయి. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 6 నుంచి జూలై 2 వరకు 23 రోజుల పాటు ఈ పరీక్షలను నిర్వహించారు. అన్ని ప్రాంతాల్లో సజావుగా, శాంతియుత వాతావరణంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా విజయవంతంగా పూర్తి అయినట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణా రెడ్డి ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

ఏపీ మెగా డీఎస్సీలో భాగంగా అన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో 91.72 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. పరీక్షల చివరి రోజైన బుధవారం (02.07.2025) రెండు సెషన్లలో ఎస్జీటీ తెలుగు, మైనర్ మీడియా పోస్టులకు పరీక్షలు జరిగాయి. మొత్తం 19,879 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా. 19,409 మంది (97.06%) పరీక్షకు హాజరయ్యారు.

ఉదయం సెషన్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 99 శాతం మంది, మధ్యాహ్నం విజయనగరం జిల్లాలో 100 శాతం మంది అభ్యర్థులు ...