Delhi, జూలై 16 -- ఢిల్లీలోని జలశక్తి కార్యాలయంలో జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరిగింది. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రతిపాదనలు కేంద్రం ముందు ఉంచగా.. వీటిలో కొన్ని అంశాలకు అంగీకారం కుదిరింది.

రెండు రాష్ట్రాల మధ్య చర్చల స్థాయికి రావడం తెలంగాణ విజయం అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన. గతంలో ముఖ్యమంత్రులు జరిపిన చర్చలు అమలు కాలేదన్నారు. ఇప్పుడు సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం మొదలైందని చెప్పారు. ఇవాళ నాలుగు అంశాలపై చర్చ జరిగిందని వివరించారు.

బనకచర్ల కడతామని ఏపీ చెప్పలేదన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ బనకచర్లపై చర్చ జరగలేదన్నారు. జల వివాదం పరిష్కారం కోసం కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. మేం గతంలో బనకచర్లపై ఫిర్యాదు చేశామని. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సంస...