భారతదేశం, సెప్టెంబర్ 9 -- ముఖ్యమంత్రి లేదా క్యాబినెట్ మంత్రులు సినిమాల్లో నటించకుండా ఎటువంటి నిషేధం లేదని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదవిని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ సరైనది కాదని అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ అన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై దాఖలైన కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి ఈ దశలో ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన 'హరి హర వీర మల్లు' సినిమా ప్రమోషన్ కోసం, వాణిజ్య కార్యకలాపాల కోసం ప్రభుత్వ నిధులు, యంత్రాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఉప ముఖ్య...