భారతదేశం, జూలై 6 -- మోస్ట్ వైలెన్స్ అవతారంలో, యాక్షన్ ప్యాక్డ్ రూపంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ అదిరిపోయాడు. తన కొత్త సినిమా 'ధురంధర్' కోసం అతను మునుపెన్నడూ లేని విధంగా ఫుల్ మాస్, యాక్షన్ మోడ్ లోకి దిగిపోయాడు. ముఖంపై రక్తంతో కనిపించాడు. రణ్ వీర్ సింగ్ 40వ పుట్టినరోజు సందర్భంగా తన తదుపరి చిత్రం ధురంధర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.

ధురంధర్ ఫస్ట్ లుక్ లో రణ్ వీర్ సింగ్ ఇంటెన్సివ్ గా కనిపించాడు. ధురంధర్ ఫస్ట్ లుక్ ను రణ్ వీర్ ఆదివారం (జూలై 6) మధ్యాహ్నం తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. "ఒక ఇన్ఫెర్నో (ఫైర్ ఎమోజీ) ఉదయిస్తుంది. అజ్ఞాత పురుషుల నిజస్వరూపాన్ని వెలికి తీయండి' అని క్యాప్షన్ ఇచ్చాడు. రణవీర్ వాయిస్ ఓవర్ లో చీకటి, మసక వెలుతురులో అతను నడుచుకుంటూ వెళ్లడంతో వీడియో మొదలవుతుంది. క్లోజప్ షాట్ లో సిగరెట్ వెలిగిస్తున్నప్పుడు పొడవాటి ...