Hyderabad, ఏప్రిల్ 22 -- ముఖంపై మొటిమలతో ఇబ్బంది పడుతున్నవారు ఎంతోమంది. మొటిమలు వచ్చాక అవి తగ్గిపోయి మచ్చలుగా మిగిలిపోతాయి. అవి చూసేందుకు అందవిహీనంగా కనిపిస్తాయి. ఇలాంటి చర్మ సమస్యలు ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తాయి.

ముఖ్యంగా ఎండాకాలంలో చర్మానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఎందుకంటే వేసవిలో ఎండ, వేడి, తేమ మొదలవుతాయి. దీని వల్ల చర్మంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ సీజన్ లో అతి పెద్ద సమస్య మొటిమలు, నల్ల మచ్చలు. ఈ మచ్చలను తగ్గించుకోవడానికి మీరు ఇంట్లో తయారుచేసిన ఫేస్ ప్యాక్ ఉపయోగించవచ్చు.

ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి, 3 టేబుల్ స్పూన్ల వేరుశెనగ ఓట్ మీల్, 1 టేబుల్ స్పూన్ తేనె, రెండు స్పూన్ల నీరు తీసుకోండి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ ఫేస్ ...