భారతదేశం, మే 3 -- పెట్టుబడి ఆధారిత కంపెనీ వ్యవస్థాపకుడు అనంత్ లాధా ఇటీవల ఆసియాలోని అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీని కలిశారు. ఆ సందర్భంగా ముకేశ్ అంబానీతో జరిగిన క్లుప్త సంభాషణను లింక్డ్ఇన్ లో ఆయన పంచుకున్నారు. ఈ పోస్ట్ కొద్ది సేపట్లోనే వైరల్ గా మారింది. వేలాది లైక్స్ ను సాధించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీతో కలిసి దిగిన రెండు ఫొటోలను కూడా ఆయన తన లింక్డ్ఇన్ పోస్ట్ లో షేర్ చేశారు. వారి సంభాషణ సారాంశాన్ని, ఒక క్యాప్షన్ ను జత చేశారు.

ముకేశ్ అంబానీతో కొద్దిసేపు సంభాషించినప్పుడు తాను ఒకే ఒక ప్రశ్న అడగగలిగానని పెట్టుబడి ఆధారిత స్టార్ట్ అప్ వ్యవస్థాపకుడు అనంత్ లాధా వెల్లడించారు. తాను ముకేశ్ అంబానీని "విజయం సాధించడానికి ఏమి కావాలి?" అనే చిన్న ప్రశ్నను అడిగానని వివరించాడు. అందుకు ముకేశ్ సూటిగా, క్లుప్తంగా ఈ జవాబు ఇచ్చారని వెల్లడిం...