భారతదేశం, జనవరి 27 -- టాలీవుడ్ క్వీన్ సమంత రూత్ ప్రభు ఏం చేసినా అది ఒక సెన్సేషన్. తన నటనతోనే కాదు, తన ఫ్యాషన్ సెన్స్‌తోనూ సామ్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. అది తన మొదటి పెళ్లి నాటి గౌన్‌ను కొత్తగా డిజైన్ చేయించుకోవడం కావచ్చు, లేదా సంప్రదాయ చేనేత వస్త్రాల్లో మెరవడం కావచ్చు.. స్టైల్ విషయంలో సామ్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. తాజాగా ముంబై వీధుల్లో ఆమె కనిపించిన తీరు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

జనవరి 25న ముంబైలోని ఒక హెయిర్ సెలూన్ నుండి బయటకు వస్తున్న సమంతను కెమెరాలు బంధించాయి. ఈ సందర్భంగా ఆమె ధరించిన సింపుల్ ట్యాంక్ టాప్, జీన్స్ కాంబినేషన్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేసిన ఒక పాపరాజీ.. "సమంత ఫేస్‌లో ఆ పెళ్లి కళ (Wedding Glow) చూడండి.. సామ్ నిజంగా మెరిసిపోతున్నారు" అంటూ క్యాప్షన్ ఇచ్చార...