భారతదేశం, జూలై 5 -- మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే ఇటీవల 'జై గుజరాత్' అంటూ నినదించడంపై శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఘాటుగా స్పందించారు. ద్రోహి, గద్దార్ అంటూ షిండే పై నిప్పులు చెరిగారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రేతో కలిసి నిర్వహించిన రీ యూనియన్ ర్యాలీలో ఉద్ధవ్ షిండేను ద్రోహిగా అభివర్ణించారు.

అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియాలో విజయం సాధించిన పుష్ప సినిమాలోని డైలాగ్ ను ఈ సందర్భంగా ఉద్ధవ్ ఠాక్రే ఉపయోగించారు. ఆ సినిమాలో పుష్పరాజ్ గా నటించిన అల్లు అర్జున్ ''ఝుకేగా నహీ సా..'' అనే డైలాగ్ వాడుతాడు. ఆ డైలాగ్ తరహాలోనే షిండే ను ఉద్దేశించి ఉద్ధవ్ ఠాక్రే ''ఉఠేగా నహీ సా..' అని వ్యాఖ్యానిస్తారు. మరాఠాకి, మహారాష్ట్రకు ఏక్ నాథ్ షిండే ద్రోహం చేశాడని, అతడు మళ్లీ విజయం సాధించలేడని పేర్కొంటూ ఉద్ధవ్ పై వ్యాఖ్యలు చేశారు. షిండే త...