భారతదేశం, జనవరి 16 -- దేశ ఆర్థిక రాజధాని ముంబై ఎవరి వశం కాబోతోంది? యావత్ భారత్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నేడు, శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. గురువారం జరిగిన పోలింగ్‌లో 52.94 శాతం ఓటింగ్ నమోదు కాగా, నేడు 227 వార్డుల అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ఎన్నికలు జరగడంతో రాజకీయ వర్గాల్లోనూ, సామాన్య ప్రజల్లోనూ భారీ ఉత్కంఠ నెలకొంది.

ముంబైతో పాటు పుణె, థానే, నవీ ముంబై వంటి మరో 28 ప్రధాన నగర పాలక సంస్థల ఫలితాలు కూడా వెలువడుతున్నాయి.

ముంబై వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 23 కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 10 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. మున్సిపల్ కమిషనర్ భూషణ్ గగ్రానీ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ సాగుతోంది. అన్ని వార్డుల్లో ఒకేసారి కాకుండా విడతల వారీగా లెక్కింపు చేపడుతున్...