భారతదేశం, జనవరి 14 -- ముంబై నగరానికి అత్యంత కీలకమైన బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం రేపు (జనవరి 15) సెలవు ప్రకటించింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో, దేశీయ స్టాక్ మార్కెట్లు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) రేపు పనిచేయవు.

ఈ వారం మధ్యలో వచ్చిన ఈ సెలవు ట్రేడర్ల లెక్కలను మార్చేసింది. సాధారణంగా ప్రతి గురువారం జరిగే నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ వీక్లీ డెరివేటివ్స్ (F&O) కాంట్రాక్టుల ఎక్స్‌పైరీ.. రేపు సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే అంటే.. నేడు (బుధవారం, జనవరి 14) ట్రేడింగ్ ముగిసే సమయానికే పూర్తవుతుంది. నేటి ముగింపు ధరల ఆధారంగానే ఈ కాంట్రాక్టుల సెటిల్మెంట్ జరుగుతుందని ఎక్స్ఛేంజీలు స్పష్టం చేశాయి. కాబట్టి ట్రేడర్లు తమ పొజ...