భారతదేశం, డిసెంబర్ 30 -- మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో రద్దీగా ఉండే భాండూప్ సబర్బన్ రైల్వే స్టేషన్ వెలుపల బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ (బెస్ట్​) బస్సు బీభత్సం సృష్టించింది. సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో డ్రైవర్ రివర్స్ చేస్తుండగా, ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి అక్కడే నిలబడి ఉన్న ప్రయాణికులపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మంది పరిస్థితి విషమంగా ఉంది.

విఖ్రోలి డిపోకు చెందిన ఈ ఎలక్ట్రిక్ బస్సు (రూట్ నంబర్ ఏ 606) భాండూప్ వెస్ట్ స్టేషన్ వద్ద ప్రయాణికులను ఎక్కించుకునే క్రమంలో ఉంది. 52 ఏళ్ల డ్రైవర్ సంతోష్ రమేష్ సావంత్ బస్సును వెనక్కి తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనతో అక్కడ హాహాకారాలు మిన్నంటాయి.

స...