భారతదేశం, జనవరి 16 -- మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార 'మహాయుతి' కూటమి విపక్షాలను చిత్తు చేస్తూ దూసుకుపోతోంది. శుక్రవారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, వెలువడుతున్న ఫలితాల ట్రెండ్స్ చూస్తుంటే రాష్ట్రంలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లలో 24 చోట్ల బీజేపీ-శివసేన (షిండే) కూటమి ఘనవిజయం సాధించే దిశగా ఉంది. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు పుణె, థానే, నవీ ముంబై, నాగ్‌పూర్ వంటి ప్రధాన నగరాల్లో మహాయుతి జెండా రెపరెపలాడుతోంది.

అత్యంత ప్రతిష్టాత్మకమైన బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC)పై పట్టు సాధించేందుకు మహాయుతి కూటమి సిద్ధమైంది. మొత్తం 227 వార్డులకు గాను, ఏకంగా 210 వార్డుల్లో ఈ కూటమి ఆధిక్యంలో ఉంది. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కావాల్సిన 114 మార్కును మహాయుతి సులువుగా దాటేసింది. మరోవైపు, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన...