భారతదేశం, జనవరి 11 -- టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే కొనుగోలు చేసిన అపార్ట్‌మెంట్‌ రేటు ఎంతో తెలిస్తే షాక్ అవాల్సిందే. స్క్వేర్ యార్డ్స్ పరిశీలించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం రితికా ముంబైలోని ప్ర‌భాదేవిలో రూ.26.30 కోట్లకు ఒక అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. పత్రాల ప్రకారం, ఆస్తి ప్ర‌భాదేవిలోని అహుజా టవర్స్‌లో ఉంది.

రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే కొన్న ఈ అపార్ట్‌మెంట్ 2,760.40 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాను కలిగి ఉంది. మూడు కార్ పార్కింగ్ స్థలాలతో వస్తుంది. ఈ లావాదేవీకి ఏకంగా రూ.1.31 కోట్ల స్టాంప్ డ్యూటీ, రూ.30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు పడ్డాయి. ఈ ఆస్తి రిజిస్ట్రేషన్ డిసెంబర్ 12, 2025న జరిగింది. పత్రాల ప్రకారం అపార్ట్‌మెంట్‌ను అజింక్యా డీవై పాటిల్, పూజా అజింక్యా పాటిల్ నుండి కొనుగోలు చేశారు.

రితికా సజ్దే...