భారతదేశం, అక్టోబర్ 30 -- వరంగల్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేసింది. మెుంథా తుపాను ప్రభావంతో భారీగా వర్షం పడి వరంగల్, హన్మకొండ నగరాలను జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. ఇంకా వరద నీరు బయటకు వెళ్లలేదు. పలు ప్రాంతాల్లో అయితే అడుగు తీసి బయటపెట్టే పరిస్థితి లేదు.

మోంథా తుపాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వరంగల్, హన్మకొండలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి నీరు చేరింది. అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి, ప్రధాన రహదారులపై రాకపోకలకు అంతరాయం కలిగింది. వరద నీరు పెద్ద ఎత్తున రోడ్లపై ప్రవహించింది.

వరంగల్ మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దాదాపు 45 ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయని, దీనితో పరిపాలన పెద్ద ఎత్తున తరలింపు...