భారతదేశం, అక్టోబర్ 27 -- ఏపీలో మెుంథా తుపాను ప్రభావం ముదలైంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, గోదావరి జిల్లాలు, కృష్ణాలో వర్షాలు పడుతున్నాయి. ఉదయం పది గంటల తర్వాత వర్షం తీవ్రత పెరిగింది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి.

ఈరోజు శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లాల వరకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాయలసీమకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. కొన్ని రోజులపాటు మత్స్యకారులు వేటకు వెళ్లొదని అధికారులు హెచ్చరించారు. ఇక మంగళవారం తుపాను బీభత్సం ఎక్కువగా ఉండనుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని అధికారులు హెచ్చరించారు.

తుపాను 18 కిలోమీటర్ల...