భారతదేశం, అక్టోబర్ 26 -- ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ్టికి తీవ్ర వాయుగుండంగా, సోమవారం ఉదయానికి తుపానుగా మారనుంది. మంగళవారం ఉదయానికి తీవ్రతుపానుగా బలపడుతుందని వాతావరణశాఖ వివరించింది.

మంగళవారం సాయంత్రం/రాత్రి సమయంలో మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. తీరం దాటే సమయములో గంటకు 90-110 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముంది.మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వివరాల ప్రకారం.. సోమ, మంగళవారాల్లో తుపాను ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముందస్తు సహయక చర్యల కోసం 8 ఎన్డీఆర్ఎఫ్, 9 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాల్లో సిద్ధంగా ఉంచారు.

ఇప్పటికే ప్రభావం చూపే జిల్లాల యంత్రాంగానికి తుపా...