Hyderabad, మార్చి 14 -- చేతిరాత ఒక వ్యక్తి వ్యక్తిత్వానికి చిహ్నంగా భావించవచ్చు. కొంతమంది పొడవుగా సంతకం పెడతారు. మరికొందరు వాలుగా రాస్తారు. మరి కొందరు సంతకం కింద చుక్కలు పెడతారు. ఇంకొందరు గీతలు పెడతారు. ఇలా రకరకాలుగా సంతకాలు పెట్టే అలవాట్లు ఉన్నాయి. అయితే సంతకాన్ని పెట్టి ఒక వ్యక్తి గురించి అంచనా వేయచ్చో లేదో తెలుసుకునేందుకు అధ్యయనాలు జరిగాయి. అయితే అధ్యయనాలు చెబుతున్న ప్రకారం సంతకాన్ని బట్టి ఒక మనిషి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చని తెలిసింది.

ఒక వ్యక్తి చేతిరాతను ఏడు విధాలుగా విశ్లేషించడం ద్వారా అతని స్వభావాన్ని అంచనా వేయచ్చని ఇప్పటికే కొన్ని అధ్యయనాలు నిరూపించాయి. కాబట్టి మీ సంతకం బట్టి మీరు ఎలాంటివారో తెలుసుకోండి.

కొందరు సంతకం చేసేటప్పుడు పెద్దగా పేరంతా రాస్తారు. ఇలా పెద్ద సంతకాలు చేసే వ్యక్తులు స్నేహశీలిగా, ఉల్లాసమైన స్వభావాన్ని కలి...