భారతదేశం, డిసెంబర్ 21 -- హైదరాబాద్ పోలీసులు ఘోస్ట్ పెయిరింగ్ అనే కొత్త వాట్సాప్ స్కామ్ గురించి వినియోగదారులను హెచ్చరించారు. ఇది నకిలీ లింక్‌ల ద్వారా ఖాతాలను హైజాక్ చేయడానికి యాప్ డివైజ్-లింకింగ్ ఫీచర్‌ను ఉపయోగించుకుంటుంది. ఈ స్కామ్ సోషల్ ఇంజనీరింగ్‌పై ఆధారపడి ఉంటుంది. దీనిని సైబర్ భద్రతా నిపుణులు ఘోస్ట్‌ పెయిరింగ్ స్కామ్ అంటున్నారు. ఇది పాస్‌వర్డ్, ఓటీపీ లేదా సిమ్ మార్చడం అవసరం లేకుండా ఒక వ్యక్తి వాట్సాప్ ఖాతాను పూర్తిగా యాక్సెస్ చేస్తుంది. ఇందుకోసం డివైజ్-లింకింగ్ ఫీచర్‌ను వాడుకుంటుంది.

దీనిపై హైదరాబాద్ పోలీసులు ఒక సలహా జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్, వీసీ సజ్జనార్ ఎక్స్ ద్వారా పౌరులను కొత్త స్కామ్ గురించి హెచ్చరించారు. Hey, I just found your photo అని లింక్‌తో మెసేజ్ వస్తుంది. మీకు తెలిసిన వారి నుండి వచ్చినట్లు కనిపించినప్పటికీ ...