భారతదేశం, జనవరి 26 -- ఏ సినిమా ఇండస్ట్రీ అయినా క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రధాన ఆరోపణ. దీనిపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించాడు. మన శంకరవరప్రసాద్ గారు మూవీ సక్సెస్ మీట్ లో ఈ హాట్ టాపిక్ పై చిరు మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. క్యాస్టింగ్ కౌచ్ లాంటివి ఏమీ ఉండవని, అది మీ ప్రవర్తనను బట్టే ఉంటుందని అనడం గమనార్హం.

మన శంకరవరప్రసాద్ గారు మెగా బ్లాక్‌బస్టర్ కావడంతో హైదరాబాద్ లో ఆదివారం (జనవరి 25) రాత్రి సక్సెెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై మాట్లాడాడు. తన కూతురినే ఉదాహరణగా చెబుతూ.. ఇక్కడ ఎవరైనా రాణిస్తారని అన్నాడు.

"ఇండస్ట్రీలో ఆడయినా, మగయినా రాణించాలంటే కచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ ఎవరైనా రాణించలేదు.. ఎవరైనా నెగటివ్ పీపుల్ ఉన్నారు.. ఇలాంటి చేదు...