భారతదేశం, ఏప్రిల్ 2 -- ఏదైనా మొబైల్ నెట్‌వర్క్‌కి పోర్ట్ చేసే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం మంచిది. మీరు మీ ప్రస్తుత నెట్‌వర్క్‌తో విసిగిపోయి ఉంటే.. పోర్ట్ చేయడానికి మంచి నెట్‌వర్క్ ఎంచుకోవాలి. మంచి నెట్‌వర్క్ అని నిర్ణయించుకుంటే పోర్ట్ చేసే ముందు కొంత క్రాస్ చెకింగ్ చేయవలసి ఉంటుంది. ఒక నెట్‌వర్క్ నుండి మరొక నెట్‌వర్క్‌కి పోర్ట్ చేసే ముందు ఈ కింది 5 విషయాలను పరిశీలించండి.

ఏదైనా టెలికాం నెట్‌వర్క్‌కు పోర్ట్ చేసే ముందు మీ ప్రాంతంలో ఆ నెట్‌వర్క్ కవరేజ్ బాగుందా? చెక్ చేయండి. మీ ప్రాంతంలో మంచి సిగ్నల్ ఉంటేనే డేటా వేగం, కాల్ నాణ్యతను పొందగలుగుతారు. అయితే కొన్ని మారుమూల ప్రాంతాలలో సిగ్నల్ బలహీనంగా ఉండవచ్చు. నెట్‌వర్క్ కవరేజ్ విఫలం కావచ్చు.

ప్రస్తుత నెట్‌వర్క్, మీరు పోర్ట్ చేస్తున్న నెట్‌వర్క్ మధ్య ప్లాన్‌లు, ప్రయోజనాలను పోల్చి చూడండి. ప్రీప...