భారతదేశం, నవంబర్ 11 -- మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి మెదడు చాలా కీలకం. ఎందుకంటే, కదలికలు, ఆలోచనలు, భావోద్వేగాలు, జ్ఞాపకశక్తితో సహా శరీరంలోని అన్ని కార్యకలాపాలు, మానసిక ప్రక్రియలను మెదడే నియంత్రిస్తుంది. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, వ్యాయామం, తగినంత నిద్ర ఎంత ముఖ్యమో, మన జీవనశైలి అలవాట్లు కూడా అంతే ప్రభావాన్ని చూపుతాయి. అయితే, కొన్నిసార్లు మనం చేసే చిన్న చిన్న పనులు ఎలాంటి హాని చేయవని భావిస్తాం. కానీ, వాటి వల్ల మన జ్ఞాపకశక్తి తగ్గి, మెదడు సంబంధిత రుగ్మతలు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

న్యూరాలజిస్ట్, బయోస్టాటిస్టిషియన్ అయిన డాక్టర్ బింగ్ (MD, MPH) నవంబర్ 4న తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో తాను ఒక న్యూరాలజిస్ట్‌గా పూర్తిగా దూరంగా ఉండే, ఇతరులు కూడా తప్పనిసరిగా మానుకోవాల్సిన మూడు అలవాట్లను వివరించారు. అవేంటంటే.. ఎక్కువ సమయం హెడ్‌ఫోన్‌లు ధరి...