భారతదేశం, నవంబర్ 24 -- మీరు మీ పిల్లల మాటలను నిజంగా వింటున్నారా? మొబైల్‌ను పక్కనపెట్టి, వారి కళ్లల్లోకి చూసి వారితో సమయం గడుపుతున్నారా? ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాల్ ఇది. ఉద్యోగ బాధ్యతలు, ఇంటి పనులు, లక్ష్యాల ఒత్తిడిలో తెలియకుండానే మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. పిల్లలు ఉత్సాహంగా తమ స్కూల్ విశేషాలు చెబుతున్నప్పుడు మీరు మెయిల్స్ చెక్ చేసుకుంటూ, యాంత్రికంగా తల ఊపుతున్నారా? లేదా వారు ముద్దుగా ఫ్యాషన్ షో చేస్తుంటే, క్లయింట్ డెడ్‌లైన్ గుర్తుకొచ్చి ఏదో ఒక సమాధానం చెప్పేస్తున్నారా?

తల్లిదండ్రుల మనసు మరెక్కడో ఉందని పిల్లలు చాలా త్వరగా గమనిస్తారు. ఈ భావోద్వేగ దూరం వారి జీవితకాల పునాదిని మార్చేస్తుంది. నిజంగా 'ఎమోషనల్‌గా ప్రెజెంట్'గా ఉండటం అనేది బిడ్డ ఎదుగుదలలో, వారు తమను, ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానంలో అ...