భారతదేశం, మే 16 -- టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ కుమార్ నాయుడు (ఎస్‌కేఎన్‌) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్ తోనే నేరుగా ఎలాగో నీ బాత్రూమ్ లోకి యాక్సెస్ లేదు కదా అని అనేశారు. ఈ కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఎస్‌కేఎన్‌ పై నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు. అతను ఇక మారడంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంతకు ఏం జరిగిందంటే?

టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ 'సింగిల్'. ఈ మూవీ కలెక్షన్ల మోత మోగిస్తోంది. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇందులో ఇవానా, కేతిక శర్మ హీరోయిన్లు. వెన్నెల కిశోర్ కీ రోల్ ప్లే చేశారు. తాజాగా ఈ మూవీ టీమ్ తో ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్‌ ఇంటర్వ్యూ నిర్వహించారు. ప్రమోషన్లలో భాగంగా ఈ ఇంటర్వ్యూ చేశారు. గీతా ఆర్ట్స్ ఛానల్ లో ఈ ఇంటర్వ్యూ రిలీజ్ చేశారు.

సిం...