భారతదేశం, ఫిబ్రవరి 10 -- వరుసగా రెండు సంక్రాంతులకు రెండు బ్లాక్‌బస్టర్లు అందించిన అనిల్ రావిపూడి వచ్చే సంక్రాంతికి మరో మూవీని రెడీ చేయబోతున్నాడు. అయితే ఈ మూవీ గురించి ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా.. సినిమాకు శ్రీమతి లలితా రెడ్డి అనే టైటిల్ పెట్టినట్లు పుకార్లు వచ్చాయి. దీనిపై అనిల్ స్పందిస్తూ.. తనదైన స్టైల్లో వాటిని ఖండించాడు.

అనిల్ రావిపూడి తన నెక్ట్స్ మూవీలో వెంకటేశ్, ఫహాద్ ఫాజిల్ నటించబోతున్నారని, ఈ సినిమా పేరు శ్రీమతి లలితా రెడ్డి అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై అనిల్ స్పందిస్తూ.. మంగళవారం (ఫిబ్రవరి 11) చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అభిమానుల ఫ్లో చూస్తుంటే యాక్షన్, కట్ కూడా వాళ్లే చెప్పేసేలా ఉన్నారని అనడం విశేషం.

"నేను పేపర్ మీద కలం కూడా పెట్టలేదు ఇంకా .. నటీనటులు, కథ, టైటిల్ కూడా పెట్టేసారు.. ఈ ఫ్లో చూస్తుం...