Hyderabad, ఏప్రిల్ 24 -- వాతావరణం కారణంగా విమానాలు ఆలస్యం కావడం లేదా రద్దు కావడం సర్వసాధారణం. ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో విమానం ఎక్కేందుకు వేచి ఉన్న ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడతారు. ఒక నివేదిక ప్రకారం 2022 జనవరి నుంచి 2024 సెప్టెంబర్ మధ్య దాదాపు 25,500 విమానాలు రద్దయ్యాయి. దీని వెనుక ప్రతికూల వాతావరణం, ప్రకృతి వైపరీత్యాలు, భద్రతా ప్రమాదాలతో సహా అనేక కారణాలు ఉండవచ్చు.

ఇలా విమానం రద్దయితే ప్రయాణికులు చాలా ఇబ్బందిపడతారు. గమ్యస్థానాలకు వెళ్లలేరు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతారు. టికెట్ డబ్బులు వేస్టు అవుతాయని బాధపడతారు. అలా బాధ పడాల్సిన అవసరం లేదు.

ఈ విషయంలో భారత ప్రభుత్వ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రయాణికులు వ్యవహరించాల్సి ఉంటుంది. ఏదైనా అనివార్య కారణాల వల్ల విమానం ఆలస్యమ...