భారతదేశం, జనవరి 1 -- టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ నటించిన 'శంబాల' చిత్రం ప్రస్తుతం సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ మూవీని మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు.

డిసెంబర్ 25న విడుదలైన హారర్ మిస్టరీ థ్రిల్లర్ శంబాల థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ క్రమంలో విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన హీరో సందీప్ కిషన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

సందీప్ కిషన్ మాట్లాడుతూ .. "'శంబాల' హిట్ అవ్వడంతో అందరూ నాకు ఫోన్ చేసి 'మీ ఫ్రెండ్ హిట్టు కొట్టాడు' కంగ్రాట్స్ అని మెసెజ్ చేస్తున్నారు. నిజాయితీగా సినిమా తీస్తే, మంచి వ్యక్తి కష్టపడి సినిమా చేస్తే హిట్ ఇస్తారని ఆడియెన్స్ మరోసారి నిరూపించారు" అని అన్నాడు.

"ఓ మూవీ సక్సె...