Hyderabad, మే 14 -- ఇటీవలి కాలంలో దాదాపు ప్రతి ఇంట్లోనూ ఫ్రిడ్జ్ ఉపయోగంలో ఉంది. ఆహారాన్ని ఎక్కువ కాలం తాజాగా ఉంచడం నుండి చల్లని ఐస్‌క్రీంను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆస్వాదించడం వరకు ఫ్రిడ్జ్ అనేక పనులను సులభతరం చేసింది. మీరు ప్రతిరోజూ ఫ్రిడ్జ్‌ని ఉపయోగిస్తున్నారు కానీ దాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేస్తున్నారు.

ఫ్రిడ్జ్ శుభ్రంగా లేకపోతే దానిలో ఉంచిన ఆహారం ఎంత సురక్షితంగా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నిజానికి ఫ్రిడ్జ్ క్లీన్ చేయకుండా ఉండటం వల్ల అది కేవలం మురికిగా ఉండటడం మాత్రము కాదు.. బ్యాక్టీరియా, ఫంగస్, దుర్వాసనకు నిలయంగా మారవచ్చు. దీనివల్ల ఆహారం త్వరగా పాడవుతుంది. ఇది మీ ఆరోగ్యానికి హాని చేస్తుంది. కాబట్టి ఫ్రిడ్జ్ ను ఎల్లప్పుడూ తాజాగా, శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రిడ్జ్‌ని ఎన్నిసార్లు ఫ్రిడ్జ్‌ని...