భారతదేశం, సెప్టెంబర్ 3 -- తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు మారుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కవిత మీడియా సమావేశం పెట్టి హరీశ్ రావు, సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేశారు. వారిద్దరి కారణంగానే బీఆర్ఎస్ పార్టీ నష్టం అని కవిత వ్యాఖ్యానించారు. అంతేకాదు కాళేశ్వరం అవినీతిలో హరీశ్ రావు పాత్ర లేదా అని సూటిగా ప్రశ్నించారు. వీరి వల్లనే కేసీఆర్‌కు అవినీతి మరకలు అని పేర్కొన్నారు. దీంతో బీఆర్ఎస్ అధిష్ఠానం సీరియస్ అయింది. కవితను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

దీనిపై మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పెట్టారు. పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు, సంతోష్ రావులపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు, సంతోష్ రావు వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఏసీబీకి హరీశ్ రావు,...