భారతదేశం, మార్చి 12 -- ఫోన్ తడిసిపోతుందనే టెన్షన్ ఉంటే మీ కోసం మార్కెట్‌లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు చేయాల్సిందల్లా వాటిని బుక్ చేసుకోవడమే. ఎందుకంటే వాటర్ ప్రూఫ్, అండర్ వాటర్ ప్రొటెక్షన్‌తో వచ్చే బడ్జెట్ రేంజ్‌కి చెందిన రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఈ రెండు లేటెస్ట్ ఫోన్లు తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. సరసమైన ధరల్లో అద్భుతమైన ఫీచర్లను ఈ ఫోన్లు అందిస్తున్నాయి. హోలీ రోజున కూడా నీటిలో తడిసినా ఏం కాకుండా ఉంటుంది. చింతించకుండా వాటిని మళ్లీ ఉపయోగించవచ్చు. ఆ ఫోన్లు ఏంటో చూద్దాం..

రియల్‌మీ పీ3ఎక్స్ 5జీ ఫోన్‌ను బ్యాంక్ డిస్కౌంట్తో ఫ్లిప్‌కార్ట్ నుంచి రూ.13,999కే కొనుగోలు చేయవచ్చు. రియల్‌మీ పీ3ఎక్స్ 5జీ డిజైన్ చాలా సన్నగా, తేలికగా ఉంటుంది. ఈ ఫోన్లో 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది రెండు రోజుల పాటు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది. మీడియ...