భారతదేశం, నవంబర్ 5 -- మీరు ఉదయం కాఫీ తాగుతుండగా, అకస్మాత్తుగా మీ ఫోన్‌కు సిగ్నల్ పోతుంది! కాల్స్ లేవు, మెసేజ్‌లు లేవు, అసలేవీ లేవు. మీరు ఫోన్‌ను రీస్టార్ట్ చేసినా సమస్య అలాగే ఉంటుంది. కొన్ని నిమిషాల తర్వాత, మీ ఈమెయిల్‌కు ఒక బ్యాంకింగ్ అలర్ట్ వస్తుంది! మీ ఖాతా నుంచి డబ్బు మాయమైపోతాయి.. దీనికి కారణం? మీ మొబైల్ నంబర్‌ను దొంగిలించిన ఒక మోసగాడు.

సిమ్-స్వాప్ ఫ్రాడ్ అని పిలుస్తున్న ఈ భయంకరమైన సైబర్‌క్రైమ్ వేగంగా విస్తరిస్తోంది. ఇది నేరగాళ్లకు మీ ఫోన్ నంబర్‌ను యాక్సెస్ చేసే వీలు కల్పిస్తుంది. దీని ద్వారా వారు మీ కాల్స్, టెక్ట్స్​లు, మీ ఆన్‌లైన్ ఖాతాలను రక్షించే ముఖ్యమైన ఒన్-టైమ్ పాస్‌వర్డ్‌లను అడ్డగించగలరు. ఒకసారి వారు మీ సిమ్​ని నియంత్రించిన తర్వాత, వారు మీ పాస్‌వర్డ్‌లను రీసెట్ చేయగలరు. మీ ఈమెయిల్‌ను హ్యాక్ చేయగలరు. అసలేం జరుగుతుందో తెలుసుకునే...