Hyderabad, మే 14 -- క్రైమ్ థ్రిల్లర్ జానర్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే వెబ్ సిరీస్ క్రిమినల్ జస్టిస్ (Criminal Justice). ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుందీ సిరీస్. ఇప్పుడు నాలుగో సీజన్ రాబోతోంది. ఇందులో డిఫెన్స్ లాయర్ మాధవ్ మిశ్రా పాత్రలో జీవించేసిన పంకజ్ త్రిపాఠీ.. ఈసారి మరో కొత్త కేసుతో ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు.

క్రిమినల్ జస్టిస్ ఎ ఫ్యామిలీ మ్యాటర్ పేరుతో ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ నాలుగో సీజన్ వస్తోంది. ఈ కొత్త సీజన్ మే 29 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. బుధవారం (మే 14) మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు.

"ఈసారి నిజానికి రెండు కాదు మూడు కోణాలు ఉన్నాయి. మిశ్రాజీ కెరీర్లో అత్యంత ముఖ్యమైన కేసును చూడటానికి మరికొన్ని రోజులు వేచి చూడండి. హాట్‌స్టార్ స్పెషల్స్ క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మ్యాటర్ మే 29 నుంచ...