భారతదేశం, డిసెంబర్ 23 -- ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, పెరుగుతున్న అప్పుల భారం మధ్య బంగారం ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఈ తరుణంలో ఇన్వెస్టర్లందరినీ వేధిస్తున్న ఒకే ఒక ప్రశ్న.. "ఇప్పుడున్న ధరల వద్ద బంగారం కొనాలా? అసలు మన పెట్టుబడుల్లో పసిడి వాటా ఎంత ఉండాలి?" దీనికి సమాధానమిస్తూ, ప్రముఖ బిలియనీర్ ఇన్వెస్టర్, బ్రిడ్జ్‌వాటర్ అసోసియేట్స్ వ్యవస్థాపకుడు రే డాలియో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అమెరికా-వెనిజులా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, డాలర్ ఇండెక్స్ బలహీనపడటంతో మంగళవారం (డిసెంబర్ 23) మార్కెట్‌లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. ఎంసీఎక్స్ (MCX) మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో రూ. 1,38,381 కి చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ గంటకు ఒక శాతం చొప్పున పెరుగుతూ ఔన్సు ధర 4,500 డాలర్లకు చేరువలో ట్రేడ్ అ...