Hyderabad, మే 16 -- పొట్ట చుట్టూ కొవ్వు చేరి అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. మీరు పొట్టను ఫ్లాట్ గా మార్చుకోవాలనుకుంటే అందుకు యోగాను ఉపయోగించుకోవచ్చు. యోగాలో భుజంగాసనం ఉంది. దీన్ని పాము భంగిమగా చెప్పుకుంటారు.

భుజంగాసనం యోగాలో ఇది ప్రముఖ ఆసనంగానే వివరిస్తారు. దీన్ని ప్రతిరోజు చేయడం వల్ల మీ పొట్ట ఫ్లాట్ గా మారుతుంది. ఈ భుజంగాసనాన్ని కోబ్రా పోజ్ అని కూడా అంటారు. దీన్ని పొట్టపై పడుకొని చేస్తారు. కాబట్టి పొట్టపై ఇది అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల పొట్ట టోన్డ్ గా మారుతుంది. అంటే ఫ్లాట్‌గా మారుతుంది.

భుజంగాసనం వేయడం వల్ల వెన్నెముక బలంగా మారుతుంది. చాతీ, భుజాలు, పొట్ట వంటి భాగాలు సాగదీసినట్టు అవుతాయి. ఇది పొట్టపై ఒత్తిడిని కలిగిస్తుం.ది దీనివల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగడం మొదలవుతుంది. మీరు ప్రతిరోజు భుజంగాసనం వేస్తూ ఉంటే నెల రోజ...