భారతదేశం, సెప్టెంబర్ 4 -- మన రుతుచక్రానికి హార్మోన్లే ఆధారం. శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటే, నెలసరి ప్రవాహం, వ్యవధి, నొప్పిలో కూడా మార్పులు కనిపిస్తాయి. ఈ మార్పులను ముందే గుర్తించగలిగితే, ఆరోగ్య సమస్యలను త్వరగా పసిగట్టి, సరైన చికిత్స తీసుకోవచ్చు.

ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రీషియన్ డాక్టర్ వైశాలి జోషి మాట్లాడుతూ.. సాధారణంగా నెలసరి ప్రతి 21 నుంచి 35 రోజులకు ఒకసారి వస్తుందని, 2 నుంచి 7 రోజులు ఉంటుందని తెలిపారు. బ్లీడింగ్ తక్కువగా లేదా ఎక్కువగా ఉండవచ్చు, కానీ నెలనెలా చిన్న చిన్న మార్పులు సహజమేనని ఆమె అన్నారు. ఈ పరిమితికి మించి తీవ్రమైన మార్పులు, లేదా భరించలేని నొప్పి ఉంటే, అది సాధారణం అని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

"నెలసరి అకస్మాత్తుగా చ...