HYderabad, ఏప్రిల్ 23 -- పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సింది తల్లీదండ్రులే. వారికి మంచి చెడు తెలియదు. వాటిని పిల్లలకు అర్థమయ్యేలా చేసేదే తల్లిదండ్రులు. పిల్లలు ఉదయం నిద్ర లేచాక మంచి అలవాట్లను పెంపొందించాలి. అలాగే వారు ఉదయాన్నే చేయకూడని పనులు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

అల్పాహారం దగ్గర నుంచి అధిక స్క్రీన్ టైమ్ వరకు పిల్లల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి మంచి ప్రణాళిక అవసరం. వారిలో ఆరోగ్యకరమైన, ఉత్పాదకతను పెంచే అలవాట్లు పెంచాలి.

పిల్లలు ఉదయం నిద్రలేవగానే వారు టీపీ, ఫోన్లు వంటివి చూడకుండా చూసుకోవాలి. వారు స్క్రీన్ వైపు చూడకుండా చూసుకోవాలి. వ్యాయామం చేయడం, పాజిటివ్ ఆలోచనలు పెంచేలా వారితో మాట్లాడడం వంటివి చేయాలి.

వారి మానసిక స్థితి, ఏకాగ్రత, శారీరక దృఢత్వాన్ని పెంచడానికి సాధారణ వ్యాయామాలు పిల్లల చేత చేయించాలి. భారీ వ్యాయామ...